కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ కరొనతో మృతి 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దిలీప్ గాంధీ (70) కరోనాతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. కోవిడ్ అని నిర్ధారణ కావడంతో ఆయన మంగళవారం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందారు. 
అహ్మద్‌నగర్‌ దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో నౌకాయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.    
 
దిలీప్‌గాంధీ మృతికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంతాపం తెలియ‌జేశారు. ఆయ‌న భౌతికంగా ప్ర‌జ‌ల‌కు దూర‌మైనా స‌మాజ సేవ‌, పేద‌ల సంక్షేమానికి చేసిన గొప్ప కృషి ద్వారా ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌నసుల్లో గుర్తుండిపోతార‌ని ప్ర‌ధాని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర‌లో బీజేపీ బ‌లోపేతానికి దిలీప్‌గాంధీ ఎన‌లేని కృషి చేశార‌ని మోదీ కొనియాడారు. దిలీప్‌గాంధీ కుటుంబ‌స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.   ‌
 
 దిలీప్‌ గాంధీ (70) మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం వ్యక్తం చేశారు.  ‘దిలీప్‌ గాంధీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.  అహ్మాద్‌నగర్‌ నుంచి ఆయన మూడుసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. జనాధరణ కలిగిన నాయకుడిగా నిరంతరం తన పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి దిలీప్‌ గాంధీ కృషి చేశారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. 
 
 భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 28,903 మందికి కోరోనా నిర్ధారణ కాగా.. 188 మంది మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు 1,14,38,7134 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 1,59,044 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2,34,406 యాక్టివ్ కేసులు ఉన్నాయని, చికిత్స నుంచి కోలుకుని 1,10,45,284 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.