సోషల్ మీడియా కంపెనీల ఉద్యోగులను బెదిరించలేదు

సోషల్ మీడియా కంపెనీల ఉద్యోగులను బెదిరించలేదు
జైలు శిక్ష పడుతుందంటూ సోషల్ మీడియా కంపెనీల ఉద్యోగులను తామెప్పుడూ బెదిరించలేదని ఐటీ మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ ఉద్యోగులు జైలు పాలవుతారంటూ కేంద్రం బెదిరించినట్టు వస్తున్న వదంతులపై ఐటీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. 
 
భారత్‌లోని ఇతర వ్యాపారాల లాగానే సోషల్ మీడియా కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ‘ఇటీవల పార్లమెంటు‌లో ప్రభుత్వం పేర్కొన్నట్టు, సోషల్ మీడియా వినియోగదారులు ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని లేదా ఇతర మంత్రులను విమర్శించవచ్చు’ అని  వివరణ ఇచ్చింది. 
 
అయితే..హింస, మతవిద్వేషాలు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై మాత్రం లోతైన సమీక్ష జరుపుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంగించి అకౌంట్లను తొలగించాలంటూ కేంద్రం ఇటీవల ట్విటర్‌ను కోరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా..ఇటువంటి హ్యాష్‌ట్యాంగులను కూడా తొలగించాలని ట్విటర్‌ను కోరింది. 
 
అయితే..ఈ ఆదేశాలను ట్విటర్ పాక్షికంగానే అమలు చేసింది. కానీ..ఈ విషయంలో చట్టం ఏం చెబుతోందనే దానిపై కేంద్రం ట్విటర్‌కు స్పష్టమైన సంకేతాలు ఇవడంతో ఎట్టకేలకు ట్విటర్ కేంద్రం కోరిన చర్యలను తీసుకుంది.