లాతూరులో నైట్ కర్ఫ్యూ…నాగపూర్ లాక్‌డౌన్  

మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో నైట్ కర్ఫ్యూ విధించారు.గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 16,620 కరోనా కేసులు నమోదైనాయి. ఆదివారం ఒక్కరోజే కరోనాతో 50మంది మరణించారు.

మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో నైట్ కర్ఫ్యూ విధించారు.గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 16,620 కరోనా కేసులు నమోదైనాయి. ఆదివారం ఒక్కరోజే కరోనాతో 50మంది మరణించారు. లాతూరు జిల్లాలో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడంతో రాత్రి 8గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధించారు.

కరోనా హాట్ స్పాట్ అయిన మీరా భయందర్ లో మార్చి 31వతేదీ వరకు లాక్ డౌన్ విధించారు.పూణే నగరంలోనూ నైట్ కర్ఫ్యూ విధించారు. కరోనా కేసులను నిరోధించేందుకు నాగపూర్ నగరంలో సోమవారం నుంచి లాక్ డౌన్ విధించారు. వారం రోజుల‌పాటు సిటీ అంత‌టా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమ‌లవుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఆ మేర‌కు ఇవాళ తెల్ల‌వారుజ‌ము నుంచే నాగ్‌పూర్‌లో కంప్లీట్ లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ లాక్‌డౌన్ అమ‌లు కోసం అధికారులు నాగ్‌పూర్ వీధుల్లో భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. రోడ్ల‌పై పోలీస్ ప‌హారాతోపాటు, వారంపాటు నగ‌ర‌మంతటా నిరంత‌ర‌ గ‌స్తీ కొన‌సాగుతుంద‌ని నాగ్‌పూర్ పోలీస్ క‌మిష‌న‌ర్ అమితేష్ కుమార్ తెలిపారు.

ఈ వారం రోజుల్లో అన‌వ‌స‌రంగా వీధుల్లోకి వ‌చ్చే వారిపైన‌, ఇత‌ర కొవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపైన‌ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.   ప్రజలు కరోనా ప్రబలకుండా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని మున్సిపల్ అధికారులు సూచించారు.

మరోవంక, దేశంలో కరోనా కేసులు గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి.

మొత్తం కేసుల్లో 1,10,07,352 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2,19,262 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 17,455 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 2,99,08,038 మంది వ్యాక్సిక్‌ తీసుకున్నారని తెలిపింది.