
కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం తన స్వరాష్ట్రమైన తెలంగాణకు ప్రయోజనం కల్పించేందుకు తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని అంటూ ఆంధ్ర ప్రదేశ్ను రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఆయనను ఆ పదవి నుండి బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.
ఈ విషయమై రాష్ట్ర నీటివనరుల శాఖ కార్యదర్శి కేంద్ర జలవనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఏపీ చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కోరడం, రాయలసీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ఆపాల్సిందిగా ఆదేశాలివ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.
కృష్ణా బేసిన్‌లో రెండు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు తెరపైకి రావడంతో ఇద్దరినీ తాము చేపట్టిన ప్రాజెక్ట్ ల డిపిఆర్ లను ఇవ్వమని కేంద్రం అడిగింది. ఈ విషయమై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు కూడా వ్రాసారు. అయినా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ, తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పరస్పరం ఫిర్యాదు చేశాయి.
ఈ నేపథ్యంలో బోర్డుపై ఒత్తిడి పెరిగింది. తమ ఫిర్యాదులపై ఎలాంటి చర్యల్ని తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభు త్వం అంటూ ఉండడంతో ఏపీ ప్రాజెక్టుల సమాచారాన్ని బోర్డు కోరింది. అలాగే అనుమతి వచ్చే వరకు రాయలసీమ ప్రాజెక్టు పనుల్ని నిలిపి వేయాలనీ ఆదేశాలను ఇచ్చింది. వీటితో పాటు కృష్ణా నీటి కేటాయింపులు, వాడకంపైనా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఈ సమయంలో బోర్డు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. అయితే ఇలాంటి సమయంలోనే బోర్డు ఏపీకి అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. అలాగే బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్టణానికి మార్చాలని ఏపీ సూచించింది. అందుకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా నది సమీపంలోనే కార్యాలయం ఉండాలని స్పష్టం చేసింది.
మరోవంక తెలంగాణ ప్రాజెక్ట్ ల గురించి బోర్డు పట్టించుకోవడం లేదని ఏపీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్‌ను బదిలీ చేయాలని కేంద్రానికి లేఖను రాసినట్టు తెలుస్తున్నది.
More Stories
గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ