రాజస్థాన్ లో మళ్లి  గెహ్లోత్, పైలట్ మధ్య పోరు 

రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య ఇదివరలో చెలరేగిన వర్గపోరు ప్రభుత్వం కూలిపోయే వరకు వెళ్లగా, తాత్కాలికంగా సర్దుబాటు జరిగినా తిరిగి వారి మధ్య తిరిగి నిప్పు చెలరేగుతుంది. 
సరిగ్గా అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో వారిద్దరూ బలపరీక్షకు దిగడం పార్టీ అధిష్టానాన్ని కలవరంకు గురిచేస్తున్నది. 
 
. ఈ పంచాయితీ కాస్త అధిష్ఠానం వద్దకు చేరడంతో ముఖ్యమంత్రి మార్పుకు కుట్ర జరుగుతున్నదని  గెహ్లోత్ వర్గంలో మళ్లీ గుబులు చెలరేగింది.  సీఎం అశోక్ గెహ్లోట్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల విషయంలో తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ సచిన్ పైలట్ వర్గం ఆరోపిస్తోంది.
 
రమేశ్ మీనా, మురళీ లాల్ మీనా, వేద ప్రకాశ్ సోలంకీ… వీరు ముగ్గురూ పైలట్ వర్గీయులు. తమ పట్ల సీఎం గెహ్లోత్ తీవ్రమైన వివక్ష చూపుతున్నారంటూ మండిపడుతున్నారు.తమ నోరు నొక్కడానికే ప్రయత్నిస్తున్నారని, అసెంబ్లీలో సరైన సీట్లను కూడా కేటాయించడం లేదని, సీట్లకు సరైన మైక్రో ఫోన్లను కూడా సమకూర్చడం లేదని ఆరోపించారు.
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే తామంతా నేరుగా రాహుల్ గాంధీని కలుసుకొని, చర్చించుకుంటామని గెహ్లోత్‌కు అల్టిమేటం జారీ చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. కానీ వాటిని మైక్రో ఫోన్లు మాత్రం లేవు. 
 
దీంతో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు చీఫ్ విప్ మహేశ్ జోషిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమకు సీట్లను కేటాయించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో మాట్లాడడానికి చాలా మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారని, కానీ… ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు మాత్రం అవకాశం ఇవ్వలేదని వారు ఆరోపించారు.

అయితే అధిష్ఠానం మాత్రం ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు చీఫ్ విప్ మహేశ్ జోషి వీరి వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ఈ విషయంపై నేనేమీ మాట్లాడను. ఈ విషయంపై అధిష్ఠానం వివరణ కోరితే మాత్రం ఓ రిపోర్టును అందజేస్తా. అంతేకానీ బహిరంగంగా మాట్లాడాను.’’ అని మహేశ్ జోషి ప్రకటించారు.