పాక్ లో హిందూ బాలిక మతమార్పిడి, ఆపై పెళ్లి

పాకిస్థాన్ దేశంలో తాజాగా మరో దారుణం వెలుగుచూసింది.13 ఏళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెను బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కవితాబాయి అనే 13 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి ఆమెను బరేల్వీ మతాధికారి మియాన్ మిథూ సమక్షంలో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి వివాహం చేసుకున్నాడని వెల్లడైంది. మతమార్పిడి వేడుకకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సింధ్ లోని ఘెట్కీ కి చెందిన కవితాబాయి అనే బాలికను బహల్కాని తెగకు చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి మతం మార్చి వివాహమాడారు. సింధ్ లోని కాశ్మోర్ జిల్లాలోని టాంగ్ వానీ తాలూకాలో ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి ఐదుగురు సాయుధులు కిడ్నాప్ చేశారు.

నిందితుడైన యువకుడు కోర్టులో హాజరై తనకు 18 ఏళ్ల వయసు నిండిందని చెప్పాడు.తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా బాలిక వివాహం జరిగిందని ఆరోపణలు రావడంతో సింధ్ పోలీసులు బాల్యవివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.బాలిక వయసును నిర్ధారించడానికి వైద్యపరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించే అవకాశం ఉంది.