పాకిస్తాన్ కు 4.5 కోట్ల డోసుల భారత్ టీకాలు 

భారత్ కు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నది. కానీ భారత్ మాత్రం ప్రాణాంతకమైన కరోనా కట్టడి కోసం పొరుగు దేశానికి 4.5 కోట్ల దోషుల వ్యాక్సిన్ ను పంపించనున్నది. మిత్ర దేశం చైనా నుండి వ్యాక్సిన్ పొందడం కోసం విఫల ప్రయత్నం చేసిన పాకిస్థాన్ కు ప్రపంచంలో మరెవ్వరు ఈ విషయంలో సహాయం చేసేందుకు ముందుకు రాని సమయంలో భారత్ ఆడుకోవడానికి సిద్దపడింది.

భారత్ నుండి నేరుగా వీటిని పొందలేక పోయినప్పటికీ, యునైటెడ్‌ గ‌వి అల‌యెన్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్లు పాకిస్థాన్‌కు వ‌స్తున్న‌ట్లు అక్క‌డి నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీసెస్ ఫెడ‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆమిర్ అష్ర‌ఫ్ ఖ‌వాజా అక్క‌డి ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీకి వెల్ల‌డించారు. గ‌వి అనేది ఒక వ్యాక్సిన్ అల‌యెన్స్‌. ప్రాణాంత‌క వ్యాధుల నుంచి ర‌క్షణ క‌ల్పించేలా ప్ర‌పంచంలోని సగం మంది పిల్ల‌ల‌కు వ్యాక్సినేట్ చేయ‌డానికి ఈ అల‌యెన్స్ సాయం చేస్తుంది. క‌రోనా మ‌హమ్మారి స‌మ‌యంలోనూ ఈ గ‌వియే పాకిస్థాన్‌కు సాయం చేస్తూ వ‌స్తోంది.

పాకిస్థాన్‌కు క‌రోనా వ్యాక్సిన్లు ఇవ్వ‌డానికి గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో గ‌వీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 4.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌లో 1.6 కోట్ల డోసులు ఈ జూన్ ‌నాటికి పాకిస్థాన్ వ‌స్తాయ‌ని అష్ర‌ఫ్ ఖ‌వాజా చెప్పారు. ఈ నెల మధ్యలో మొదటి దశ సరఫరాలు భారత్ నుండి ఉండే అవకాశం ఉంది. జూన్ చివరి నాటికి మొత్తం సరఫరా పూర్తవుతుంది. ఈ వ్యాక్సిన్లు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌ని సెనేట‌ర్ ముషాహిద్ హుస్సేన్ స‌య్య‌ద్ ప్ర‌శ్నించిన‌ప్పుడు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వ‌స్తున్న‌ట్లు ఖ‌వాజా తెలిపారు.

పాకిస్తాన్ జనాభాలో 20 శాతం మందికి ఈ టీకాలు సరిపోతాయి. త‌క్కువ ఆదాయం ఉన్న దేశాల‌కు వ్యాక్సిన్ల‌ను అందించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ గ‌వీ అల‌యెన్స్‌లో భాగంగా పాకిస్థానీల‌కు భారత్ లో తయారీ అయిన వ్యాక్సిన్లు వేయ‌నున్న‌ట్లు ఖ‌వాజా చెప్పారు.

భారత్ ఇప్పటికే 4 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ ను యుకె, కెనడా, బ్రెజిల్, మెక్సికో, బాంగ్లాదేశ్, దక్షిణ ఆఫ్రికా లతో సహా 66 దేశాలకు పంపినట్లు విదేశాంగ వ్యవహారాల వర్గాలు తెలుపుతున్నాయి. వీటిల్లో 67.5 డోసులను సహాయంగా, మిత్రత్వంకు సూచనగా ఉచితంగా అందజేయగా, మిగిలిన వాటిని వాణిజ్యపరంగా అందజేశారు.

మొత్తం మీద 190 దేశాలకు 2 బిలియన్ కు పైగా డోసులను సరఫరా చేయాలని భారత్ ప్రయత్నం చేస్తున్నది. అంటే మొత్తం ప్రపంచంలోని వ్యాక్సిన్ లలో 60 శాతం భారత్ సరఫరా చేసిన్నట్లు కాగలదు. ప్రపంచంపై వ్యాక్సిన్ `పవర్ హౌస్’ గా భారత్ నిలవనుంది.