భైంసా అల్లరి మూకలకు కలెక్టర్‌ మద్దతు  

పక్కా ప్రణాళిక ప్రకారమే భైంసాలో వరుసగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ డి అర్వింద్‌ ఆరోపించారు.  రాష్ట్రంలో హిందువులంతా ఏకం కావాలని పిలుపిస్తూ . భైంసా అల్లరి మూకలకు కలెక్టర్‌ మద్దతు ఉందని ధ్వజమెత్తారు.
 
బైంసా ఘటనపై కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని చెప్పారు. భూకబ్జాల్లో ఎమ్మెల్సీ కవిత.. మంత్రి కేటీఆర్‌ను మించిపోయిందని దయ్యబట్టారు.  భైంసా ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 
 
బాలీవుడ్ మత్తు నుంచి మంత్రి కేటీఆర్ బయటకు రావాలని అరవింద్ హితవు  చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు ఓటు బ్యాంక్‌ రాజకీయాల  చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. 
 
మహమూద్‌అలీ చేతకాని హోంమంత్రి అని ఎద్దేవా చేశారు.  చేతకాకుంటే లా అండ్ ఆర్డర్‌ను మాకు అప్పజెప్పాలని.. ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తామని అర్వింద్‌ చెప్పారు. మత్తులో సీఎం కేసీఆర్ తన మతాన్ని మర్చిపోయాడని అర్వింద్‌ ఎద్దేవా చేశారు.