కొన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లతోపాటు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 18 రకాల సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేస్తున్నట్లు తెలిపింది.
ఆధార్ ధృవీకరణతో ఈ సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రెనివల్, వెహికిల్ రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ లాంటి వాటి కోసం ఇక రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో)లకు వెళ్లాల్సిన పనిలేదు.
మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దగా ఇబ్బంది లేకుండానే ప్రజలు ఈ సేవలు పొందడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
ఆ 18 సేవలు ఇవే..
1. లెర్నర్ లైసెన్స్
2. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్
3. డ్రైవింగ్ చేసే సామర్థ్యం నిరూపించుకోవాల్సిన అవసరం లేని వారి డ్రైవింగ్ లైసెన్స్ రెనివల్
4. లైసెన్స్, ఆర్సీలో అడ్రెస్ మార్పు
5. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ
6. మోటార్ వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్
7. పూర్తిగా సిద్ధమైన మోటారు వాహనం రిజిస్ట్రేషన్
8. డూప్లికేట్ సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
9. సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోసం ఎన్‌వోసీ జారీ అప్లికేషన్
10. లైసెన్స్ నుంచి వెహికిల్ సరెండర్
11. మోటార్ వెహికిల్ ఓనర్‌షిప్ బదిలీ నోటీసు
12. మోటార్ వెహికిల్ ఓనర్‌షిప్ బదిలీ అప్లికేషన్
13. ఆర్సీలో అడ్రెస్ మార్పు సమాచారం
14. అక్రెడిటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి శిక్షణ పొందుతున్న డ్రైవర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
15. దౌత్య అధికారి మోటార్ వాహనం రిజిస్ట్రేషన్ అప్లికేషన్
16. దౌత్యాధికారి మోటార్ వాహనానికి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మార్క్
17. హైర్-పర్‌చేజ్ అగ్రీమెంట్ ఎండార్స్‌మెంట్
18.హైర్-పర్‌చేజ్ అగ్రిమెంట్ రద్దు
More Stories
జమ్ముకశ్మీర్ తొలిదశ పోలింగ్లో 61 శాతం ఓటింగ్
అరుణాచల్ సరిహద్దు సమీపంలో చైనా కొత్త హెలిపోర్ట్ నిర్మాణం
చైనా జాతీయుడికి `సుప్రీం’ బెయిల్ నిరాకరణ