
నేపాల్ ప్రతినిధుల సభ సమావేశాన్ని ఈ నెల 7వ తేదీన ఏర్పాటు చేయాలని నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి కోరారు. దిగువ సభను రద్దు చేస్తూ ప్రధాని కె.పి.శర్మ ఓలి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదిగా పేర్కొంటూ, ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ దిగువసభ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షురాలు తెలిపారు.
రాజ్యాంగంలోని 93(1)వ అధికరణ కింద నేపాల్ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు సభను పునరుద్ధరిస్తున్నట్లు అధ్యక్షురాలు భండారీ పేర్కొన్నారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఒక నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు ప్రకారం ఈ నెల 7వ తేదీన స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలకు 275 మంది సభ్యులు గల దిగువ సభ సమావేశమవుతుంది.
డిసెంబరు 20న సభను రద్దు చేస్తూ ప్రధాని ఓలి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ గత వారం సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వవడంతో అధ్యక్షురాలి ఆదేశాలు జారీ అయ్యాయి. 13 రోజుల్లోగా సభను సమావేశపరచాలని కోర్టు ఆదేశించింది. ఓలి సిఫార్సు మేరకు భండారి సభను రద్దు చేయడంతో పాటు ఏప్రిల్ 30న, మే 10న తాజాగా ఎన్నికలను నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది.
More Stories
మరో ముగ్గురు హమాస్ బందీల విడుదల
చెర్నోబిల్ రియాక్టర్పై రష్యా డ్రోన్ దాడి!
సీమాంతర ఉగ్రవాదం ప్రకటనపై పాక్ మండిపాటు