కుటుంబ పార్టీలతో దేశానికి లాభం లేదు 

టీఆర్‌ఎస్‌ లాంటి కుటుంబ పార్టీలతో దేశానికి లాభం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పష్టం చేశారు. బిజెపిఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని హోటల్‌ మారియెట్‌లో  ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో పట్టభద్రుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాదారు.   

దుబ్బాకలో బీజేపీ కొట్టిన దెబ్బకు.. టీఆర్‌ఎస్‌ ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావును చూసి టీఆర్‌ఎస్‌ నాయకులు భయపడుతున్నారని, అందుకే వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.ఆత్మనిర్భర్‌ భారత్‌’తో దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు.

రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు మండలిలో చేసిన ప్రసంగాల పుస్తకాన్ని ఈసందర్భంగా కేంద్రమంత్రి ఆవిష్కరించారు.

తెలంగాణలో గ్రాడుయేట్ల నియోజకవర్గాల నుండి శాసనమండలికి పోటీ చేస్తున్న ఇద్దరు  బిజెపి అభ్యర్థులను గెలిపించడానికి బిజెపి కార్యకర్తలు కష్టపడి కృషి చేయాలనీ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిలుపిచ్చారు. ప్రతి ఓటర్ ను గుర్తింప వలసి ఉన్నందున ఈ ఎన్నికలుకాశ్యమైనవని  చెప్పారు. ఇతర పార్టీలకు భిన్నంగా కష్టపడి పనిచేసే కార్యకర్తలే బిజెపికి అసలైన బలమని జవదేకర్ పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బిజెపి గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి భరోసా వ్యక్తం చేశారు.  కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఉగ్రవాదుల కార్యకలాపాలను చాలావరకు కట్టడి చేయగలిగామని చెప్పారు.