ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆలయాలపై దాడులు

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆలయాలపై దాడులు
ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయాల పరిరక్షణ బాధ్యత ఎపి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
 
రాష్ట్ర విభజన అనంతరం ఎపిలో దేవాదాయశాఖ ఆధీనంలో 4 లక్షల 60 వేల ఎకారల భూమి ఉందని, అయితే ఆలయాలకు సంబంధించిన కొన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆయన ఆవేదన క్తంవ్య చేశారు. ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం సరైన బాధ్యత తీసుకోవడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
రాయలసీమలో 27 ఆలయాలపై దాడులు చేశారని, ఆ ఆలయాలను తాను పరిశీలించినట్టు ఆయన తెలిపారు. ఈ ఆలయాల్లోని 17 ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్న సూచనలతో టిటిడి చైర్మర్ సుబ్బారెడ్డికి వినతిపత్రం అందించానని ఆయన వెల్లడించారు. 
 
ఆలయాలు బాగున్నప్పుడే ప్రజల్లో ధర్మనిరతి, నైతిక ప్రవృత్తి పెరుగుతుందని ఆయన చెప్పారు. ఎపిలో అభివృద్ధికి నోచని ఆలయాలను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.