ఎంబిబిఎస్‌ ప్రవేశపరీక్షకు బయాలజీ తప్పనిసరి

బయాలజీలో ప్రాక్టికల్‌ నాలెడ్జీతో పాటు కూడా థియరీ పరిజ్ఞానం కలిగి ఉండటం ఎంబిబిఎస్‌ ప్రవేశపరీక్షకు తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండాలని.. ఇవి ఎంబిబిఎస్ కు గుండెవంటివని తెలిపింది.  ఈ అర్హత ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాల్సిందేనని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్రావు, జస్టిస్‌ ఎస్‌. రవీంద్ర భట్‌లతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ..కాళోజీ నారాయణ రావ్‌ యూనివర్శిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బయాలజీలో అవసరమైన రికార్డులు సమర్పించలేదంటూ 2020-21 విద్యా సంవత్సరానికి ఎంబిబిఎస్‌ కోర్సులో అడ్మిషన్‌ కల్పించేందుకు కాళోజీ యూనివర్శిటీ నిరాకరించింది. 

చట్ట విరుద్ధంగా ఆమెను నిరాకరించిందంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో జీవశాస్త్రంలో ప్రాక్టికల్‌, థియరీ రెండూ ప్రథానమేనని .. ఎంబిబిఎస్‌ పరీక్షలకు అత్యవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. 1997 గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ లోని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేషన్స్‌ యాక్ట్‌ 4  పేర్కొన్న ఎంబిబిఎస్‌ కోర్సులో ప్రవేశించేందుకు ఒక అభ్యర్థి అర్హతా ప్రమాణాలను ప్రస్తావించారు. 

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీలో ప్రాక్టికల్స్‌తో పాటు థియరీ పరిజ్ఞానం ఉండాలని పేర్కొందని జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర్రావు తీర్పులో గుర్తు చేశారు. అంటే  అభ్యర్థి ఇంటర్మీడియట్‌ స్థాయి పరీక్ష లేదా గ్రాడ్యుయేట్‌ కోర్స్‌లో మొదటి ఏడాది అర్హత కలిగి ఉండాలి. అలాగే ఈ స్థాయిలో భౌతిక, రసాయన, జీవశాస్త్రంతో పాటు ఇంగ్లీష్‌ భాషలోనూ పట్టు ఉండాలని తెలిపింది.