గాల్వాన్ లోయలో గత ఏడాది జూన్ లో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు బుకాయిస్తూ వస్తున్న చైనా ఎనిమిది నెలల అనంతరం నేడు విడుదల చేసిన వీడియో వారి సైనికుల దురాక్రమణకు వెల్లడి చేస్తుందని అంతర్జాతీయ సైనిక నిపుణులు సహితం నిర్ధారణ చేస్తున్నారు.
‘విదేశీ శక్తులు యధాతథ స్థితిలో మార్పు తెచ్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారు. ఫలితంగా సరిహద్దుల్లో వేగంగా ఉద్రిక్తతలు పెరిగాయి’ అంటూ భారత్ దురాక్రమణకు ఎత్తుకోవడంతో ఘర్షణ తలెత్తిన్నట్లు చిత్రీకరించే ప్రయత్నాన్ని ఈ సందర్భంగా చైనా చేస్తున్నది.
కానీ ఈ వీడియోను సాటిలైట్ చిత్రాలు, గూగుల్ మ్యాప్ లను ఉపయోగించి నిశితంగా పరిశీలిస్తే వాస్తవాధీన రేఖను దాటి భారత్ భూభాగంలో 50 మీటర్ల లోపల ఈ ఘర్షణ జరిగిన్నట్లు స్పష్టం అవుతుందని ఆస్ట్రేలియన్ స్ట్రేటెజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ లో చైనా వ్యవహారాల నిపుణుడు నాథన్ రోజర్ నిర్ధారించారు.
భారత భూభాగంలోకి చొచ్చుకుపోయి వచ్చి మరి చైనా సైనికులు భారత సైనికులపై దాడి జరిపినటు భారత్ చేస్తున్న ఆరోపణలకు చైనా విడుదల చేసిన వీడియో తిరుగులేని సాక్ష్యం కాగలదని భావిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా సైనికులను ధీటుగా ఎదుర్కొని, వారిని కట్టడి చేయడంలో 20 మంది భారత సైనికులు మృతి చెందడం తెలిసిందే.
అయితే చైనా సైనికులు 60 మంది చని పోయారని అమెరికా, 40 మంది చని పోయారని రష్యా లకు చెందిన ఏజెన్సీలు నిర్ధారించిన ఈ విషయమై మౌనంగా ఉంటూ వచ్చిన చైనా తొలిసారిగా తమ దేశానికి చెందిన నలుగురు సైనికులు మృతి చెందిన్నట్లు శుక్రవారమే అంగీకరించింది.
ఒకపక్క సరిహద్దుల్లో సైన్యాల ఉపసంహరణ జరుగుతున్న నేపథ్యంలో చైనా ఈ వివరాలను వెల్లడించడం ప్రాధాన్యత సంతరింప చేసుకొన్నది. మొత్తం నెపాన్ని భారత్ పై నెట్టే క్రమంలో అంతర్జాతీయంగా చైనా మరింత దోషిగా నిలబడే పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఈ వీడియోలో రెండు దేశాలకు చెందిన దళాలు.. స్టీల్ రాడ్లతో గ్యాంగ్‌వార్‌కు దిగాయి. గాల్వన్ నదీ పరివాహాక ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు ముష్టిఘాతానికి దిగారు. ఆ వీడియోలో చైనా కమండర్ ఒకరు భారత దళానికి వార్నింగ్ ఇస్తూ కనిపించారు. ఇక ఆ తర్వాత రెండు దేశాలకు చెందిన దళాలు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.
ఎదురెదురుగా నిలుచున్న ఆ దళాలు.. ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. రాత్రి పూట కూడా ఆ దళాలు నువ్వానేనా అన్నట్లు ఆ లోయలో సమరానికి సిద్దమైయ్యాయి. ఆ వీడియోలోనే తమ దళాధినేత తీవ్రంగా గాయపడినట్లు కూడా చైనా చూపించింది. ఈ వీడియోను అత్యంత చాకచక్యంగా ఎడిటింగ్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. కేవలం భారత్ వైపు మాత్రమే తప్పు ఉందని చిత్రీకరించేదిగా వీడియోను ఎడిట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చైనా దళాలను శాంతి కాముకుల్నిగా చూపిస్తూ వీడియోను రిలీజ్ చేశారు
More Stories
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది
కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం