న్యాయవాద దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరపాలి 

న్యాయవాద దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరపాలి 
హైకోర్టు న్యాయవాదలు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల దారుణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 
 
అడ్వకేట్ జేఏసి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు వామన్రావు దంపతులు హత్యకు గురైన ప్రాంతం రామగిరి మండల కల్వచర్ల  సందర్శించి పరిశీలించారు. వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
తెలంగాణ కోసం పోరాడిన న్యాయవాదులకు ప్రభుత్వం పై నమ్మకం కలగాలంటే వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.వామన్ రా వు కుటుంబానికి రక్షణ కల్పించి, ఆర్థిక సహాయం అందిచాలని డిమాండ్ చేశారు. అన్యాయాలపై, భూ కబ్జాలపై పోరాడడమే నేరమా అని ప్రశ్నించారు.
హత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని, వామన్ రావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు న్యాయవాదులు అంతా గట్టు కుటుంబానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. కాగా, అడ్వకేట్ దంపతుల హతపై సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు విప్పలేదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  ప్రశ్నించారు. వామనరావు దంపతులది ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. యధా రాజా తథా ప్రజా అన్నట్టుగా రాష్ట్రంలో గుండాలు, రౌడీలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.