త్వరలో బీజేపీలో చేరనున్న మెట్రో మ్యాన్ ఈ . శ్రీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడవేయడం, కేరళలో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తానని చెప్పారు.
పార్టీ కోరితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు సీఎం పదవినీ చేపడతానని మెట్రో మ్యాన్‌గా పేరొందిన శ్రీధరన్ స్పష్టం చేశారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రానికి నిధుల లభ్యత పెంచేందుకు ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం, పెద్దసంఖ్యలో పరిశ్రమలను తీసుకురావడం తమ ముందున్న లక్ష్యాలని వివరించారు.
రాష్ట్రంలో ప్రతి మళయాళీపై ప్రస్తుతం రూ 1.2 లక్షల అప్పుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పులు తీసుకురావడం కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మనం పరిష్కారం అన్వేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ పరిష్కారమవుతాయని ఆయన తేల్చిచెప్పారు.
శ్రీధరన్ శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. కేరళలో బీజేపీని అధికారంలోకి తేవడంతోపాటు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రుణాల ఊబి నుంచి బయటపడేయడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు.
గవర్నర్ పదవి వద్దంటూ, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నించినపుడు శ్రీధరన్ మాట్లాడుతూ, గవర్నర్ పదవిని చేపట్టినట్లయితే తాను రాష్ట్రం కోసం కృషి చేయడం సాధ్యం కాదన్నారు. రాజ్యాంగ పదవి అయినప్పటికీ గవర్నర్‌కు ఏ అధికారాలూ ఉండవన్నారు.
ఇక ఈనెల 25న కాషాయ తీర్ధం స్వీకరించడం ద్వారా శ్రీధరన్ రాజకీయ రంగంలో ప్రవేశించనున్నారు. గతంలో పలు మెట్రో రైల్ ప్రాజెక్టులను విజయవంతంగా పట్టాలెక్కింమన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ రూపు రేఖలను మార్చిన శ్రీధరన్‌ను దేశవ్యాప్తంగా అభిమానిస్తారు.
ఆయనకు విదేశాల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో కేరళ శాసన సభ ఎన్నికలు జరగవచ్చు. యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లకు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీలో మెట్రో శ్రీధరన్ చేరనుండటంతో కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారు.
శ్రీధరన్ ఆదివారం తమ పార్టీలో చేరుతారని సురేంద్రన్ చెప్పారు. రెండు వారాలపాటు సాగే విజయ యాత్ర కూడా ఆదివారమే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వరకు జరిగే ఈ యాత్రలో ఎల్‌డీఎఫ్ తప్పుడు పరిపాలనను ప్రజలకు వివరిస్తామన్నారు. గతంలో యూడీఎఫ్ పరిపాలనలో అనుసరించిన తప్పుడు విధానాలపై కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు. చిన శ్రీధరన్ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్ధంగా నిర్వహించి మన్ననలు పొందారు.
More Stories
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
జార్ఖండ్‌లో ఎన్నార్సీని అమలు చేస్తాం