సారుకు కుటుంబం, ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు

సారుకు కుటుంబం, ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. మొక్కలు నాటాలని ఆదేశాలిచ్చి.. బిల్లులు మాత్రం విడుదల చేయడంలేదని ఆమె ధ్వజమెత్తారు. 

మయానికి జీతాలందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే సర్కారుకు పట్టడంలేదని ఆమె మండిపడ్డారు. ఇటువంటి నిర్లక్ష్యపు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారని ఆమె గుర్తు చేశారు. 

అయితే, పాపం వాళ్ళు… గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని… మొక్కల రేటు, ట్రీ గార్డులు, కూలీ ఖర్చులు ఎలా భరించాలని గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదని ఆమె ధ్వజమెత్తారు. వేసవి కాలంలో నీళ్ళు లేక మొక్కలు బతక్కపోతే తమకు షోకాజులు పంపుతారని వారు ఆవేదన చెందుతున్నారని ఆమె తెలిపారు. ఇవేవీ సర్కారుకు పట్టలేదని ఆమె చెప్పారు.