రామమందిరంకు అంబేద్కర్ మహాసభ వెండి ఇటుక 

అయోధ్య నగరంలోని రామాలయం నిర్మాణానికి అంబేద్కర్ మహాసభ ట్రస్టు వెండి ఇటుకను విరాళంగా అందజేసింది. అంబేద్కర్ మహాసభ ట్రస్టు తరపున వెండి ఇటుకను రామాలయం నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థట్రస్టుకు అందజేశారు. 

దేశంలో దలితుల నమ్మకం ప్రకారం తాము ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకను అందజేశామని అంబేద్కర్ మహాసభ ట్రస్టు ఛైర్మన్ డాక్టర్ లాల్జీ ప్రసాద్ నిర్మల్ చెప్పారు. 14 ఏళ్లు వనవాసం చేసిన శ్రీరాముడు ఆదివాసీలతో ఉన్నారని, అందుకే తాము రామాలయం నిర్మాణం కోసం వెండి ఇటుకను విరాళంగా అందజేశామని లాల్జీ ప్రసాద్ చెప్పారు. 

రామాలయం నిర్మాణం కోసం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27వతేదీ వరకు విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని శ్రీరామజన్మభూమి తీర్థట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు. రామాలయం నిర్మాణం కోసం ప్రజలు విరాళాలు అందిస్తున్నారని మిశ్రా వివరించారు.