ఏపీలో మార్చ్ 10న  మున్సిపల్ ఎన్నికలు 

ఒక వంక పంచాయతీ ఎన్నికల సమరం కొనసాగుతూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ ఎన్నికల పక్రియను కూడా రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రారంభించింది. 2020లో కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ఉదయం ఎస్‌ఈసీ విడుదల చేసింది.
 
మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చిన 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది.  మార్చి 14న  ఓట్ల లెక్కింపు జరుగనుంది. మార్చి 2, 3 తేదీలలో ఉదయం 11 నుంచీ మధ్యాహ్నం 3 వరకూ ఉపసంహరణకు సమయం ఉంటుంది.  మార్చి 3న మధ్యాహ్నం 3 తరువాత అభ్యర్ధుల తుది జాబితాను విడుదల చేయనుంది.  
 
మార్చి 10న ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగనుంది. మార్చి 13న ఉదయం 7 నుంచీ సాయంత్రం 5 వరకూ  రీపోలింగ్‌ను నిర్వహించనుంది. మార్చి 14న ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది.
 
12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 
 
ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఇసి తాజాగా నిర్ణయించింది.
 
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు

శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ
విజయనగరం జిల్లా: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల
విశాఖ జిల్లా: నర్సీపట్నం, యలమంచిలి
తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం
పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం‌, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం
కృష్ణా జిల్లా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు
గుంటూరు జిల్లా: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల
ప్రకాశం జిల్లా: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు
నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు(N), సూళ్లూరుపేట, నాయుడుపేట
అనంతపురం జిల్లా: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి
అనంతపురం జిల్లా: రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర
కర్నూల్‌ జిల్లా: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ
కర్నూల్‌ జిల్లా: నందికొట్కూరు, గూడూరు(K), ఆత్మకూరు(K)
వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్‌, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల
చిత్తూరు జిల్లా: మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు