సైనికుల త్యాగాలు చిరస్మరణీయం

దేశం కోసం బలిదానం చేసిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.  పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సిఆర్ పిఎఫ్ సైనికులకు ఆదివారం ఆయన నివాళులు అర్పించారు.
 
అమరవీరుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సైనికులు శత్రుదేశాలతో పోరాటం చేస్తున్నారని, వారికి దేశ ప్రజల మద్ధతు ఎప్పుడూ ఉంటుందని, సైనికుల కుటుంబాలకు అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. 
 
పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌ సిఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బీఎస్‌ యడ్యూరప్ప, యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలను వారు కొనియాడారు.