విదేశాలకు రూ.338 కోట్ల విలువైన వ్యాక్సిన్ ఎగుమతి

ఇప్పటివరకు విదేశాలకు దాదాపు రూ. 338 క్లో రూపాయల విలువైన కొవిడ్-19 వ్యాక్సిన్‌ని కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్  రాజ్యసభలో తెలిపారు. ఈ ఎగుమతులలో మిత్ర దేశాలకు గ్రాంట్లుగా అందచేసిన వ్యాక్సిన్ డోసులతోపాటు వాణిజ్య అమ్మకాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
 
కరోనా టీకా ఎగుమతి జనవరిలో ప్రారంభమైందని ఒక అనుబంధ సమాధానంగా ఆయన చెప్పారు. ముందుగా దేశీయ కరోన టీకా అవసరాలకు ప్రాధాన్యమిచ్చిన తర్వాతే మిత్రదేశాలకు వ్యాక్సిన్ అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు.
పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతిలో 62.7లక్షల డోసులు కేంద్ర ప్రభుత్వం అందచేసిన గ్రాంట్ల రూపంలో ఉన్నాయని, వీటి విలువ రూ. 125.4 కోట్లని గోయల్ తెలిపారు. వాణిజ్య అమ్మకం ద్వారా ఎగుమతి చేసిన 1.05 కోట్ల డోసుల విలువ రూ. 125.4 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు కరోనా వ్యాక్సిన్ తయారుచేసేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు.