ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఆదివారం ఉదయం నందాదేవి గ్లేసియర్ విరిగి పడటంతో ధౌలిగంగా నదిలో వచ్చిన ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదలో 125మందికిపైగా మృతి చెందినట్లు భావిస్తున్నారు. అక్కడి రిషి గంగా పవర్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న సుమారు 150 మంది కార్మికులు ఈ వరదలో కొట్టుకుపోయారు.
వీళ్లలో ఇప్పటి వరకూ 10 మంది మృతదేహాలను వెలికి తీయగలిగారు. వందల మంది ఐటీబీపీ, ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మూడు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ వరదలో రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి.
మంచు దిబ్బలు విరిగిపడటంతో ధౌలిగంగ నదిలో పోటెత్తిన వరదలు రిషిగంగ నదిపై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. రిషిగంగ నదిపై బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) నిర్మిస్తున్న ఓ వంతెన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. రిషిగంగ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలు కూడా ధ్వంసమైంది.
చమోలీ, జోషిమఠ్‌తోపాటు ఇతర దిగువ ప్రాంతాలపై కూడా వరదల ప్రభావం పడింది. వీటికి తోడు ధౌలిగంగ, అలకనంద, రిషిగంగ నదుల పరీవాహక ప్రాంతాల్లో పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. ఎగువ నుంచి ప్రవాహ ఉధృతి కొనసాగుతుండడంతో ప్రయాగ్‌రాజ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. సహాయక చర్యల్లో 3200 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాద స్థలంలో ఏరియల్ సర్వే నిర్వహించామని ముఖ్యమంత్రి రావత్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధౌలీ గంగా నది తీరా ప్రాంతాలలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని పేర్కొన్నారు.
సహాయక చర్యల కోసం ఆర్మీ హెలీకాప్టర్లను వినియోగించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది కోసం సి-130. ఎఎన్-32 రవాణా విమానాలను ఉపయోగిస్తున్నారు. ఉత్తరాఖండ్ సిఎం రావత్, ఐటిబిపి డిజిపితో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
ఉత్తరాఖండ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. వరద ఘటనపై సిఎం రావత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అసోం పర్యటనలోనే అధికారులతో మోదీ సమీక్షలు జరిపారు. మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల సహాయం ప్రకటించారు. ఉత్తరాఖండ్ వరద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడేందుకు సహాయయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
More Stories
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర