రాష్ట్రంలో దుర్మార్గం, హింస, అవినీతి ఎంతో పెరిగిపోయాయని పేర్కొంటూ త్వరలోనే బెంగాల్ ప్రజలు ‘శ్రీరామ్ కార్డు’ను బయటికి తీయనున్నారని ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలు అంటించారు. భారత్‌మాతాకీ జై అని నినాదం చేసినా సరే మమత తీవ్ర అసహనానికి గురవుతారని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా హక్కుల గురించి అడిగినా సరే, అదే స్థాయిలో అసహనానికి గురవుతారని ధ్వజమెత్తారు. బెంగాల్‌లోని హల్దియా ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ కానీ దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అసహనానికి గురికారని చురకలంటించారు.
నేతాజీ 125 వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ప్రధాని మోదీ, సీఎం మమత ఒకే వేదికపై ఆసీనులయ్యారు. మమత ప్రసంగాన్ని ప్రారంభించగానే కొందరు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తిన మమత… మాట్లాడకుండానే కూర్చుండిపోయారు. ఈ నేపథ్యంలోనే మోదీ పై వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని సంవత్సరాలు గడిచినా, బెంగాల్‌లో ‘పరివర్తన’ ఏమాత్రం రాలేదని విమర్శించారు. బెంగాల్ పరిస్థితులు ఇంతలా దిగజారడానికి కారణం సీఎం మమతాయేనని, మమత నేతృత్వంలోనే వామపక్షాలు మళ్లీ బలం పుంజుకున్నాయని ఆరోపించారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే సిండికేట్ వారుంటారని, ఆ తర్వాత రాష్ట్రంలో కచ్చితంగా మార్పు వస్తుందని ఆయన ప్రకటించారు. నందిగ్రామ్ వేదికగా నానా హంగామా సృష్టించిన వారిని సీఎం మమత ఎందుకు పార్టీలోకి తీసుకున్నారో ప్రజలంతా అడగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర పరిస్థితి ఇంతలా దిగజారిందంటే అక్కడి రాజకీయాలే కారణమని, ఇక్కడ అభివృద్ధి రాజకీయాలు జరగడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ఆ తర్వాత వామపక్షాల ఏలుబడిలో అవినీతితో పాటు దౌర్జన్యం కూడా జరిగిందని, అందుకే రాష్ట్ర పరిస్థితి ఇంతలా దిగజారిందని మోదీ విమర్శించారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక పోగా ప్రజలకు మేలు కలిగించే కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు కాకుండా మమతా అడ్డుకొంటున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ సన్మాన్ కార్యక్రమం అమలు పరచకుండా రైతులకు అన్యాయం చేసిన మమతా రైతులు ఆగ్రహిస్తుండడంతో ఇప్పుడు ఎన్నికల ముందు అమలుకు ఒప్పుకున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు.
More Stories
ఈషా ఫౌండేషన్‌పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ బ్రేక్
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!