కేవలం ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బనెర్జీ అహంకారం కారణంగానే ఈ పధకాన్ని అనుమతించక పోవడంతో పశ్చిమ బెంగాల్ లోని రైతులకు పీఎం కిసాన్ పధకం ప్రయోజనాలు అందడం లేదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు.
నెలరోజుల పాటు జరిగే బిజెపి ప్రచారం యాత్ర `క్రిషక్ సురక్ష అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటూ కొద్దీ రోజులలో జరిగే ఎన్నికలలో ఆమె పాలనకు చరమగీతం పడడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పీఎం కిసాన్ యోజన ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా రైతులకు ఒకొక్కరికి సంవత్సరానికి రూ 6,000 చొప్పున నగదు ఇస్తుంటే, బెంగాల్ లో మాత్రం మమతా ఈ పధకాన్ని అమలు కానీవడం లేదని ఆయన విమర్శించారు.
పథకం అమలు చేయడం లేదంటూ సుమారు 25 లక్షల మంది ప్రజలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, దీంతో మమత సైతం రాష్ట్రంలో పథకం అమలు చేయబోతున్నట్టు ప్రకటించారని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే మమత ఆ ప్రకటన చేశారని, అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నడ్డా అన్నారు. నష్టం జరిగిపోయిన తర్వాత చింతిస్తే ప్రయోజనం ఏమిటని మమత సర్కార్‌ను నిలదీశారు.
మమతా కారణంగా రాష్ట్రంలోని 70 వేలమంది రైతులు గత రెండేళ్లుగా సంవత్సారానికి రూ 6,000 చొప్పున పొందలేక పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విధంగా మమతా రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మమతా అనుసరిస్తున్న తప్పుడు విధానాల కారణంగా బెంగాల్ లో రైతులు సాగునీరు, గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాలు లభించడం లేదని నడ్డా ధ్వజమెత్తారు.
మమతకు “జై శ్రీరామ్” అంటే ఎందుకు అసహనమే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుష్క్రిస్తున్న రైతు అనుకూల విధానాల కారణంగా దేశ వ్యాప్తంగా రైతులు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని ఆయన వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం మోదీ ప్రభుత్వం ప్రారంభించిన 100 కిసాన్ రైళ్ల కారణంగా రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడికైనా పంపుకోగలుగుతున్నారని చెలిపారు. దానితో వారు తమ ఉత్పత్తులకు ఒకటిన్నర రేట్లు అదనపు విలువ పొందగలుగుతున్నారని చెప్పారు.
‘ఇదొక నిరంకుశ ప్రభుత్వం. 130 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను చంపేశారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. చివరకు మాపై కూడా దాడులు జరుపుతున్నారంటే బెంగాల్‌లో సామాన్య జనం పరిస్థితి ఏమిటో నేను ఆర్థం చేసుకోగలను’ అని నడ్డా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌కు ప్రతీదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని, మమతా బెనర్జీ మాత్రం ‘వద్దు వద్దు’ అంటూనే వచ్చారని, ఏది ఇస్తామన్నా ఆమె నోట ఇదే మాటవినిపిస్తుందని నడ్డా అన్నారు. మే తరువాత రాష్ట్రానికి అన్నీ వస్తాయని నడ్డా భరోసా ఇచ్చారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు