
‘నేను ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను. కాంగ్రెస్ విపక్షానికే పరిమితమవుతుంది’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప నేడు స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున నేడు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి త్వరలో మారబోతున్నారని అంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు.
గతంలోనూ తాను వందలాది కేసులు ఎదుర్కొన్నానని, ప్రతిసారి నిజాయితీపరుడుగానే వాటి నుంచి బయటపడ్డానని గుర్తు చేశారు. కొందరు నేతలు పగటి కలలు కంటూ కర్ణాటకలో తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని రోజూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ విషయంపై యడియూరప్ప పై వ్యాఖ్యలు చేశారు.
‘నేను రాజీనామా చేస్తారని మీరు (సిద్ధరామయ్య) వంద సార్లు పైనే చెప్పారు. నేను మరోసారి మీరు వివరణ ఇస్తున్నాను. ప్రధాని మోదీ, అమిత్‌షా, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నంత వరకూ ఎలాంటి ఢోకా లేదు” అంటూ ఆయన భరోసా వ్యక్తం చేశారు.
అలాగే ఎన్ని కేసులు బనాయించినప్పటికీ పోరాడుతూనే ఉంటానని, సీఎంగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. “మేము 150కి పైగా సీట్లు గెలుచుకుంటాం. మీరు (సిద్ధరామయ్య) విపక్ష స్థానంలోనే కూర్చుంటారు? అని యడియూరప్ప ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో 2019 జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి రాజకీయంగా ఆయన పెను సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. సీఎం మార్పిడిపై రోజుకో ప్రకటన వస్తోంది.
More Stories
దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలి
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!