మయన్మార్  సైనిక్ తిరుగుబాటుపై భారత్ ఆందోళన 

మయన్మార్‌ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడు సహా ఆంగ్‌ సాన్‌ సూకీ, ఇతర నేతలను నిర్బంధించడంపై భారత్‌  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 
 
మయన్మార్‌లో నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీ గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భారీ సాధించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపిస్తూ విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. దీనిపై ఎలాంటి ఆధారాలు లేవంటూ సైన్యం చేసిన ఫిర్యాదును తోసిపుచ్చింది. 
 
ఈ క్రమంలో సోమవారం పార్లమెంట్‌ సమావేశం కానున్న నేపథ్యంలో సైన్యం తిరుగుబాటు చేసింది. ఆంగ్‌ సాక్‌ సూకీతో పాటు అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడంతో ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీనిపై విదేశాంగ స్పందించింది.
 
ప్రజాస్వామ్య ప్రక్రియకు భారత్‌ ఎల్లప్పుడు మద్దతు ఉంటుందని పేర్కొంటూ చట్ట పాలన,  ప్రజాస్వామ్య ప్రక్రియను తప్పక సమర్థించాలని సూచించింది. ప్రస్తుతం మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.