కరోనా ప్రభావంతో కొన్నాళ్లు నిలిచి పోయిన రైల్వే సేవలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రైళ్లలో ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు ప్రారంభం కానున్నాయని భారతీయ రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత దశల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆంక్షలను సడలిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. రైళ్లలో ఈ-కేటరింగ్ సేవలను మళ్లీ ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమయింది. ఈ సేవల వల్ల రైల్వే ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తమ బెర్తు వద్దకే తెప్పించుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ వెబ్‌సైట్ https://www.ecatering.irctc.co.in లేదా 1323 నెంబర్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్ యాప్ అయిన Food on Track యాప్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు దేశ వ్యాప్తంగా మొత్తం ఒకేసారి ప్రారంభించకుండా దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ముందుగా 30 రైల్వే స్టేషన్‌లలో ఈ సేవలను ప్రారంభించి 250 రైళ్లకు మాత్రమే కేటరింగ్ సేవలను రైల్వే శాఖ అందించనుంది. తర్వాత దశలవారీగా దేశ వ్యాప్తంగా కేటరింగ్ సేవలను ప్రారంభించనుంది.

More Stories
బీమా సంస్థలు వైద్య చికిత్స పద్ధతులను నిర్దేశించలేవు
ఒక్కరోజే 550కు పైగా ఇండిగో విమానాల రద్దు
పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం