
కాలుష్యానికి కారణమయ్యే పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్(హరిత పన్ను) విధించే ప్రతిపాదనకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఎనిమిదేళ్లు పైబడిన రవాణా వాహనాలకు చెల్లించే రోడ్ ట్యాక్స్‌లో 10 నుంచి 25 శాతం హరిత పన్ను కింద చెల్లించే విధంగా కేంద్రం తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఫిట్నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ సందర్భంగా ఈ పన్ను వసూలు చేయొచ్చని సమాచారం. ఇక వ్యక్తిగత వాహనాలు కొన్న పదిహేనేళ్ల తరువాతే ఈ పన్ను వర్తించనుంది. అయితే.. ప్రభుత్వ ప్రజారవాణా వాహనాలపై మాత్రం కేంద్రం కొంత తక్కువ మొత్తంలోనే పన్ను వసూలు చేయనుంది. ఇక అత్యంత కాలుష్య పూరిత నగరాల్లో గ్రీన్ ట్యాక్స్ ఏకంగా 50 శాతం వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా.. వాహనం ఏకరమైనది, ఎటువంటి ఇంధనం వినియోగిస్తోందనే అంశాల వారీగా కూడా పన్ను చెల్లింపుల్లో మార్పులు ఉంటాయి.
హైబ్రీడ్, ఎలక్ట్రికల్, ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించే వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. వసాయానికి అనుబంధంగా ఉండే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, టిల్లర్లకు కూడా ఇది వర్తిస్తుంది. కాగా.. ఈ ముసాయిదా ప్రతిపాదనలను కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాల కోసం పంపించింది. అభిప్రాయ సేకరణ పూర్తైన అనంతరం ప్రభుత్వం దీన్ని నోటిఫై చేస్తుంది.
More Stories
కాంగ్రెస్ ఎంపీపై అస్సాం సీఎం భార్య రూ.10 కోట్ల పరువునష్టం దావా
లాలూ దంపతులు, తేజస్వికి ఢిల్లీ కోర్టు సమన్లు
రైల్వే ప్రమాదాలలో పరిహారం 10 రేట్లు పెంపు