
త్వరలో జరుగనున్న తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై రెండు పార్టీల నేతలు సమాలోచనలు ప్రారంభించారు.
ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆదివారం రాత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు.
సుమారు 3 గంటల పాటు వీరి మంతనాలు సాగాయి. అభ్యర్థి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఉమ్మడిగా ప్రచారం జరిపే అంశాన్ని కూడా సవివరంగా చర్చించారు.
అంతకు ముందు రోజు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను కలసి ఉప ఎన్నికలపై ప్రాధమిక చర్చలు జరిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తిరుపతి ఉపఎన్నిక నాంది పలికే విధంగా ఉమ్మడిగా గట్టి పోటీ ఇవ్వడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు తిరుపతి నియోజకవర్గ ప్రాంతంలో పలుసార్లు పర్యటనలు జరిపి ఎన్నిక ప్రచార సన్నాహాలు చేస్తున్నాయి.
More Stories
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు