ముందే కరోనా కట్టడిలో చైనా విఫలం …. డ‌బ్ల్యూహెచ్‌వో

మొద‌ట్లోనే క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని చైనా, ఇత‌ర దేశాల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) ఆక్షేపించింది. ఫ‌లితంగా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్ర‌జారోగ్య చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు గ‌ల అవ‌కాశాల‌ను చైనా ఇత‌ర దేశాలు కోల్పోయాయ‌ని లిబియా మాజీ అధ్య‌క్షుడు ఎల్లెన్ జాన్స‌న్ స‌ర్‌లీఫ్‌, న్యూజిలాండ్ మాజీ ప్ర‌ధాని హెలెన్ క్లార్క్ సార‌ధ్యంలోని క‌మిటీ పేర్కొంది. 

జ‌న‌వ‌రిలోనే చైనాలోని స్థానిక‌, జాతీయ ఆరోగ్య సంస్థ‌ల అధికారులు ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు బ‌ల‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సింద‌ని అభిప్రాయ ప‌డింది. గ‌తేడాది జ‌న‌వ‌రి చివ‌రిలో కొన్ని దేశాలు మాత్ర‌మే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోగ‌లిగాయ‌ని పేర్కంది.

ప్ర‌పంచ మాన‌వాళిని వ‌ణికించిన క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం నేప‌థ్యంలో గ్లోబ‌ల్ ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) ఎందుకు ప్రక‌టించ‌లేదో ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని క‌మిటీ వ్యాఖ్యానించింది. గ‌తేడాది జ‌న‌వ‌రి 22వ తేదీన అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైన డ‌బ్ల్యూహెచ్‌వో దీనిపై నిర్ణ‌యం తీసుకోలేక‌పోయింది.

గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాల‌న్న విష‌య‌మై డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణుల క‌మిటీ విడిపోయింది. గ‌త ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు నాటికే ప‌లు ఖండాల‌కు క‌రోనా విస్త‌రించింది. కానీ, మార్చి 11వ తేదీ వ‌ర‌కు క‌రోనాను డ‌బ్ల్యూహెచ్‌వో మ‌హ‌మ్మారిగా అభివ‌ర్ణించ‌లేక‌పోయింది. స‌‌కాలంలో డ‌బ్ల్యూహెచ్‌వో మ‌హ‌మ్మారి ప్ర‌భావాన్ని గుర్తించ‌లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌దేప‌దే విమ‌ర్శించారు. డ‌బ్ల్యూహెచ్‌వోకు త‌మ వాటా నిధులు ఇవ్వ‌డానికి నిరాక‌రించారు.