రామమందిరంకు జివికె రెడ్డి రూ 1 కోటి విరాళం 

ప్రముఖ పారిశ్రామిక వేత్త, జివికె గ్రూప్ అధినేత జివికె రెడ్డి అయోధ్యలో రామమందిర నిర్మాణంకు రూ 1 కోటి విరాళంగా ఇచ్చారు. ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేంద్రకు రూ 1 కోటి చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పాల్గొన్నారు. 
 
ఇలా ఉండగా, అయోధ్య రామమందిర నిర్మాణంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్‌ కోర్‌ కమిటీ మెంబర్‌ వివేక్‌‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్‌‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కోదండరామాలయంలో  జరిగిన కార్యక్రమంలోపాల్గొంటూ బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. 
 
రామమందిరం నిర్మాణం కోసం 76 సార్లు పోరాటాలు జరిగాయని, సుమారు 4 లక్షల మందికి పైగా రామభక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆర్‌‌ఎస్‌‌ఎస్‌ విభాగ్‌‌ (ఆరు జిల్లాల) సహ కార్యవాహ్‌‌ కె. రాజన్న చెప్పారు. జనజాగరణ అభియాన్‌‌ ట్రస్ట్‌‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలోని 266 గ్రామాలు, రెండు పట్టణాల్లో ప్రతి ఇంటికెళ్లి మందిర నిర్మాణం కోసం నిధులు సేకరించనున్నామని తెలిపారు.