గోపూజ మహోత్సవంలో  సీఎం జగన్‌

గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి   పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించారురు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు.
 
 ‘ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని’ గోపూజ మహోత్సవ విశిష్టత గురించి నరసరావుపేట ఇస్కాన్‌ టెంపుల్‌ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్‌ వివరించారు. ప్రతి ఇంట్లో గోవులను పూజించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరించి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు.  
జగన్ మోహన్ రెడ్డి పాలనలో క్రైస్తవుల మత మార్పిడిలకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లభిస్తున్నదని, క్రైస్తవ నేపధ్యం గలవారికి ప్రభుత్వంలో కీలక పదవులు లభిస్తున్నాయని, గత కొద్దీ నెలలుగా సుమారు 150 దేవాలయాలపై రాష్ట్రంలో దాడులు జరిగిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెద్ద  ఎత్తులన ఆరోపణలు వస్తున్న సమయంలో జగన్ గోపూజకు హాజరుకావడం ఆసక్తి కలిగిస్తున్నది.