రామజన్మభూమి విశేషాలతో పుస్తక ఆవిష్కరణ

రామ జన్మభూమికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన “రాజిల్లు రామభూమి – శ్రీ రామ జన్మభూమి” పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సహ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ గారు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు ఆవిష్కరించారు.
భాగ్యనగరం అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో సమాచార భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఈ పుస్తకావిష్కరణ జరిగింది. విశ్వసంవాద కేంద్ర తెలంగాణా సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని ‘సంవిత్ ప్రకాశన్ పబ్లికేషన్స్’ వారు ప్రచురించారు. రామజన్మభూమి ప్రాంగణ పున: ప్రాప్తి, మందిర నిర్మాణ చరిత్రకు సంబంధించిన విశేషాలై ఈ పుస్తకంలో పొందుపర్చి ఉన్నాయి. ఈ పుస్త‌కంలో ముందుమాట‌ను విశ్వహిందూ పరిషద్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి వై.రాఘవులు గారు రాయ‌డం జ‌రిగింది.
ఈ పుస్తక కాపీలు భాగ్యనగరంలోని బర్కత్ పురలో ఉన్న ‘సాహిత్యనికేతన్’ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంటాయి.
పుస్తకాన్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునే వారు ఈ క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

https://www.hindueshop.com/product/rajillu-ramabhoomi-telugu/