
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఘట్కోపార్‌లో శనివారంనాడు దీపావళి శోభ కనిపించింది. కరోనా వైరస్‌ను తరమిగొట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిదశ దేశవ్యాప్తంగా మొదలైన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. కరోనా రావణాసురుని దిష్టిబొమ్మలు తగులబెట్టారు. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు వెలిగించి కేరింతలు కొట్టారు.
‘ప్రధాని మోదీ సారథ్యంలో దేశవ్యాప్తంగా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు కోసమే యావద్దేశం ఎదురుచూస్తోంది’ అని వెస్ట్ ఘట్కోపార్ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. లంక నుంచి శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చినప్పుడు సంబరాలు మిన్నంటిన విధంగానే ఇవాళ తామంతా దీపావళి చేసుకుంటున్నామని చెప్పారు.
కోవిడ్ వారియర్లు, శాస్త్రవేత్తలతో సహా కోవిడ్‌పై పోరాటం జరిపిన వారందరినీ అభినందించే సమయమిదని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా ప్రపంచమంతా ఎన్నో కష్టాలను ఎదుర్కొందనీ, త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుదని తాము ఆశిస్తున్నామని చెప్పారు.
More Stories
ఈవిఎం సోర్స్కోడ్పై ఆడిట్ పిల్ కొట్టివేత
కావేరి వివాదంలో జోక్యంకు `సుప్రీం’ నిరాకరణ
మొబైల్స్కు ఎమర్జెన్సీ అలర్ట్.. ఆందోళన చెందకండి