రామతీర్థం ఘటన ఓ దుస్సాహసం  

రామతీర్థం ఘటన ఓ దుస్సాహసంగా త్రిదండి చినజీయర్‌ స్వామి అభివర్ణించారు. రామతీర్థంలో చినజీయర్‌ స్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా శ్రీకోదండ రామాలయాన్ని చినజీయర్‌స్వామి సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వామీజీకి అధికారులు తెలిపారు.  

కొండపై రాముడి విగ్రహ ధ్వంసం ఘటనా స్థలాన్ని స్వామీజీ పరిశీలించారు. ఆలయ పరిసరాలను, విగ్రహం లభించిన నీటి కొలనును  కూడా సందర్శించారు.    అనంతరం ఆయన మాట్లాడాడుతూ ఆలయాల భద్రతపై రామతీర్థం ఘటన ఓ హెచ్చరిక. రక్షణ లేని ఆలయాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని స్పష్టం చేశారు.

ఏడాదిలోగా రామతీర్ధం కొండపై పునర్ నిర్మాణ పనులు పూర్తి కావాలని ప్రభుత్వానికి సూచించారు. అంత వరకు కొండ కిందన ఉన్న ఆలయంలో స్వామి వారికి నిత్య సేవలు అందించాలని చెప్పా రు.