గ్యాస్ వినియోగదారులు సిలిండర్ కోసం ఇబ్బందులు పడకుండా ఇండేన్ గ్యాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ చేసుకున్న మొదటి రోజే, గంట సమయంలోనే వంట గ్యాస్ డెలివరీ చేసే విధంగా సేవ ప్రారంభించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చర్యలు చేబడుతున్నది.
ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాకు తత్కాల్ ఎల్పీజీ సేవలు ప్రారంభించనుంది. ఈ తత్కాల్ పథకం సేవల కింద బుక్ చేసుకున్న అర గంట, నలభై ఐదు నిమిషాల్లో వినియోగదారులకు గ్యాస్ డెలివరీ చేయనున్నట్లు ఐఒసి అధికారులు తెలిపారు.
గుర్తించిన ప్రాంతాల పరిధిలోకి వచ్చే సింగిల్ సిలిండర్ వినియోగదారులకు ఈ సేవలు అందింపనున్నారు. అయితే ఎప్పటి నుంచి అమలవుతాయన్నది మాత్రం స్పష్టంచేయలేదు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తత్కాల్ వంట గ్యాస్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు.

More Stories
ముడి చమురు ధర 100 డాలర్లు దాటటంతో భారత్ ఆందోళన
`రైల్వే’ కుంభకోణంలో లాలూ, ఆయన భార్య, కుమారుడిపై అభియోగాలు
రూ.20,804 కోట్లతో 8 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు