కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బుధవారంనాడు మంత్రివర్గ విస్తరణ జరిపారు. కొత్తగా ఏడుగురుని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎంటీబీ నాగరాజ్, ఉమేష్ కత్తి, అరివింద్ లింబావలి, మురుగేష్ నిరాని, ఆర్.శంకర్, సీపీ యోగేశ్వర్, అంగార ఎస్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
రాజ్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో కొత్త మంత్రులతో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. గత ఏడాది జూలైలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన మూడో మంత్రివర్గ విస్తరణ ఇది.
కీలకమైన మంత్రివర్గ విస్తరణ కోసం గత ఆదివారంనాడు ఢిల్లీ వెళ్లిన యడియూరప్ప ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమయ్యారు. పార్టీ అధిష్ఠానం సాధ్యమైనంత త్వరలోనే మంత్రుల పేర్లు ఖరారు చేస్తుందని, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వందశాతం ఇదే చివరి సమావేశం అవుతుందని సమావేశానంతరం మీడియాకు యడియూరప్ప తెలిపారు.
కరోనా, పకృతి వైపరీత్యాలు వంటి కారణాలతో మంత్రివర్గ విస్తరణ సుమారు సంవత్సరకాలంగా వాయిదా పడుతూ వస్తున్నది.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్‌కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ