
వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు రూ.7200 వేల బకాయి చెల్లించిన తరువాతే ఓట్లు అడిగేందుకు టీఆర్ఎస్ రావాలని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి బిక్షం ఎత్తుకునే దుస్థితి వచ్చిందని విమర్శించాచారు. నిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు బీజేపీ గెలుపు కోసం పని వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో విసిగిపోయిన పట్టభద్రులు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.
బీజేపీ గెలుపు కోసం వారు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతూ వారి అండతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీది గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి ప్రతి ఒక్క ఓటర్‌ను కలిసి బీజేపీకి ఓటు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని బండి సంజయ్ సూచించారు.
More Stories
తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు
కులాంతర వివాహాలు ధర్మ సమ్మతమే
24 నుంచి హైదరాబాద్- బెంగళూరు, విజయవాడ- చెన్నై వందే భారత్