
ఢిల్లీని వణికిస్తా అన్న కేసీఆర్ మాయమై ఇటీవల యశోదలో కనిపించాడని, దుబ్బాక ఎన్నికల తర్వాత సీఎం కి వణుకు పట్టుకుందని బీజేపీ ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మునిసిపాలిటీలోని మల్లారెడ్డి కాలనీలో పలు పార్టీల చెందిన వారంతా బీజేపీలో చేరారు.
రఘునందన్ వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాలిస్తున్న తమపై ఇక్కడ ఒక్క రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ అంతలా ఎగిసిపడితే ఎలా? అని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల తర్వాత అల్లుడు శంకరగిరి మాన్యాలు పడితే, కొడుకు కంప్యూటర్ ముందు పెట్టుకొని రాష్ట్రాన్ని తానే నడుపుతున్నానని ప్రేలేపిస్తున్నాడన్నారని ధ్వజమెత్తారు.
పటాన్ చెరు నియోజక వర్గానికి వస్తే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వెంచర్లలో ప్లాట్లను ఎలా గుంజుకోవాలో బాగా తెలుసు కానీ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పట్టవని దయ్యబట్టారు.
ఏడు సంవత్సరాల కాలంలో బీరంగుడా నుండి కిష్టారెడ్డిపేట్ వరకు ఇప్పుడు మొదలైన రేడియల్ రోడ్ 2023 వరకు అయినా.. ముగుసేటట్టు లేదని విమరసంచారు. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారేమోనని రఘునందన్ రావు చెప్పారు.
More Stories
20ఏళ్ల తర్వాత కృషి బ్యాంకు డైరెక్టర్‌ను అరెస్ట్
30 నుంచి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో “శౌర్య జాగరణ యాత్ర”
పేదలకు ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం