పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.5 వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిపై ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం మేర తగ్గించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు కనీసం రూ.5 వరకూ తగ్గే అవకాశం ఉంది. ఈ మధ్యే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.
ఢిల్లీలో మొదటి సారిగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ.84 కు చేరుకుంది. ఇలాంటి సమయంలో ఎక్సైజ్‌డ్యూటీని తగ్గిస్తే వాటి ధరలు దిగి రానున్నాయి.
గతేడాది లాకడౌన్ సమయంలో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకూ పెంచింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను పెంచాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతోపాటు, కొంత భారాన్ని ఆయిల్ కంపెనీలు భరించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరనుంది.
More Stories
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఎన్నికల బాండ్ల పథకంపై తీర్పు సమీక్షకు `సుప్రీం’ నిరాకరణ