కరోనాకు ‘పంచగవ్య’ ఆయుర్వేద చికిత్స

పంచగవ్య ఆయుర్వేద చికిత్సతో మొత్తం 800మంది కొవిడ్ 19 రోగులు కోలుకోగలిగారని రాష్ట్రీయ కామథేను ఆయోగ్ (ఆర్‌కెఎ) ఛైర్మన్ వల్లభ్‌భాయ్ కథీరియా వెల్లడించారు. దేశంలో నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో ఇది రుజువైందని చెప్పారు. 
 
గుజరాత్‌లోని రాజ్‌కోట్, బరోడాలలో ఉత్తరప్రదేశ్ వారణాసిలో, మహారాష్ట్రలో కల్యాణ్‌లో గత ఏడాది జూన్ అక్టోబర్ మధ్యకాలంలో ఈ ట్రయల్స్ నిర్వహించడమైందని చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్‌జివొల సహకారంతో ఒక్కోచోట 200మందికి ట్రయల్స్‌లో తీసు కున్నామని వివరించారు.
 
జాతీయస్థాయిలో మొట్టమొదటిసారిగౌ విగ్యా న్ (కౌ సైన్స్)పై వచ్చేనెల పరీక్ష జరుగుతుందని తెలిపారు. కేంద్ర మత్స, పశుసంవర్థక, పాడి పరిశ్రమపరిధిలో ఉండే ఈ రాష్ట్రీయ కామథేన్ ఆయోగ్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. గోసంరక్షణ, పోషణ, అభివృద్ధి ఈ విభాగం లక్షాలు. త్వరలో ఈ ట్రయల్స్ డేటా ఆయుష్ మంత్రిత్వ శాఖకు సమర్పిస్తామని ఆయన వివరించారు.