ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలు బాగున్నాయని కొనియాడారు. కరోనా వైరస్ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ప్రపంచలోని అన్ని దేశాల కంటే భారత్ ముందుందని అభినందించారు.
దీనికి సంబంధించి టెడ్రోస్ మంగళవారం ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ల అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టెడ్రోస్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేస్తున్న భారత్.. వ్యాక్సినేషన్ ప్రక్రియతో దేశ ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు.
అందరం కలిసి కట్టుగా పనిచేస్తే, సురక్షితమైన సమర్థవంతమైన వ్యాక్సిన్లను అవసరమైన వారికి ఇవ్వవచ్చు అని టెడ్రోస్ తెలిపారు. అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత్ కలిసికట్టుగా ముందుకు సాగితే అత్యంత ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేయవచ్చని టెడ్రోస్ తెలిపారు.
తద్వారా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బలహీన వర్గాలకు వ్యాక్సినేషన్ చేసేలా చర్యలు చేపట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరాటంలో మోదీ గొప్పగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు.
More Stories
పారాలింపిక్స్‌లో 18వ స్థానంలో భారత్
రష్యా, చైనా కీలక అధికారులతో అజిత్ దోవల్ భేటీ
కార్గిల్ యుద్ధం చేసింది మేమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ సైన్యం