వాయవ్య పాకిస్థాన్‌లో బుధవారం ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలిపింది. ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం, పాకిస్థాన్‌లోని కైబర్ పక్తూన్‌క్వాలోని, కరక్ జిల్లా, తేరి గ్రామంలో బుధవారం హిందూ దేవాలయాన్ని తగులబెట్టి, పెను విద్వంసం సృష్టించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి అధికారికంగా నిరసన తెలిపింది.
తేరి గ్రామంలోని శ్రీ పరమహంసజీ మహరాజ్ సమాధిని, కృష్ణ ద్వార మందిరాన్ని ముస్లిం మత సంస్థల ఆధ్వర్యంలో స్థానిక ముస్లింలు ధ్వంసం చేశారు. దాదాపు 1,500 మంది ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనపై మానవ హక్కుల సంఘాలు, హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్‌కు ఈ సంఘటన గురించి ఆ దేశంలోని మైనారిటీ ప్రజా ప్రతినిధి రమేశ్ కుమార్ తెలియజేశారు. జనవరి 5న దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్ హక్ ఖాద్రి స్పందిస్తూ, వర్గ సామరస్యానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మైనారిటీల మత స్వేచ్ఛను పరిరక్షించడం పాకిస్థాన్‌కు మత, రాజ్యాంగ, నైతిక, జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.
ఇలా ఉండగా, ఖైబర్-పఖ్తుం ఖ్వా రాష్ట్రంలోని కరక్ జిల్లాలో అల్లరిమూకలు హిందూ ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని పాకిస్థాన్ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 5వ తేదీన ఈ అంశంపై విచారణ జరుపనున్నది. ఆలయ ధ్వంసంపై 4వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని మైనార్టీ హక్కుల సంఘం చైర్మన్, ఖైబర్-పఖ్తుంఖ్వా రాష్ట్ర సీఎస్, పోలీస్ చీఫ్‌లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ఆదేశించారు.
మరోవైపు విధ్వంసానికి గురైన ఆలయాన్ని ప్రభుత్వమే తిరిగి నిర్మిస్తుందని పఖ్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ శుక్రవారం ప్రకటించారు. దాడితో సంబంధం ఉన్న 45 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆలయ విధ్వంసంపై పాక్‌లోని హిందువులు కరాచీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
More Stories
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది
కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం