
కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేయడం ఓ వ్యర్థ ప్రయత్నమని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ ఎద్దేవా చేశారు. ఆ మూడు చట్టాలు ఇప్పటికే పార్లమెంట్‌లో ఆమోదం పొందాయని గుర్తు చేశారు
.
దేశ ప్రజల దృక్పథానికి ఇది పూర్తి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎంసీ చట్టం ప్రకారమే రైతు తన పంటను అమ్ముకోవాలని కేరళ ప్రభుత్వం గట్టిగా భావిస్తే… దానికి తగ్గట్టుగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు లబ్ధి చేకూర్చడానికే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కేరళ శాసన సభ ఏకగ్రీవంగా తిరస్కరించింది. ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడంతో వివాదం ఏర్పడింది. బీజేపీ ఎమ్మెల్యే ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారా? అనే అంశంపై స్పష్టత లేదు.
More Stories
ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల రక్షణ సామగ్రి
107 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు
న్యాయవ్యవస్ధపై చేసిన వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ క్షమాపణ