సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. హైబిపితో బాధపడుతున్న ఆయన ఈనెల 25వ తేదిన అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్‌లో చేరిన ఆయనకు ఆయన వ్యక్తిగత వైద్యుడితో పాటు అపోలో ఆసుపత్రి ప్రత్యేక వైద్యబృందం రెండ్రోజుల పాటు మెరుగైన వైద్యం అందించారు. బిపిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు.
వివిధ రకాల చికిత్స అనంతరం బిపి లెవల్స్ సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆదివారం మధ్యాహ్నం రజనీని డిశ్చార్జ్ చేసినట్లు అపోలో ఆసుపత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆయన చెన్నై తరలి వెళ్లినట్లు సమాచారం. అయితే వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని అపోలో వైద్యులు రజనీకి సూచించారు. అంతేగాక ఒత్తిడికి గురికాకుండా కొద్దిపాటి వ్యాయామం కూడా చేయాలని సూచించారు.
మరోవైపు వయసు రీత్యా రజనీకాంత్ తప్పనిసరిగా ఆరోగ్యనియమాలు పాటించాల్సిందేనని అపోలో ఎండి సంగీతారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ ఉన్న ఉన్న రజనీకి అకస్మత్తుగా బిపి లెవల్స్ అదుపు తప్పాయి. దీంతో ఆ చిత్ర యూనిట్ హుటాహుటిన రజనీని ఈనెల 25వ తేదిన ఆసుపత్రికి తరలించారు.
ఆ రోజు రాత్రి వరకుఆయనకు బిపి అదుపులోకి రాకపోవడంతో వైద్యులతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. డిశ్చార్జ్ తర్వాత రజనీకాంత్ అపోలో ఆస్పత్రి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోని అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. ఆయనకు శ్రీమతి లతా రజనీకాంత్ హారతితో ఇంట్లోకి ఆహ్వానించారు.
More Stories
నీట్ పేపర్ లీకేజ్లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర