బ్యాంకుల ముందు చెత్త వేయటం హేయమైన చర్య

కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వేయటం హేయమైన చర్య అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఈ చర్యకు ప్రోత్సాహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 నిజంగా మున్సిపల్ అధికారులు ప్రమేయం ఉంటే వారిని సర్వీస్ నుంచి తొలగించాలని కోరారు. రాజకీయ ప్రమేయం ఉంటే వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. బ్యాంకుల ముందు చెత్త వేయటం చెత్త పని.. రాష్ట్రంలో ఈ సంస్కృతి ఏంటో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. 
 
గతంలో ఓ నేత కేంద్ర ప్రభుత్వ వాహనాలు రాష్ట్రంలోకి రానివ్వను అన్నారు. ఇప్పుడు నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పని చేయానివ్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని జీవీఎల్ హెచ్చరించారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి పంట ఎక్కువగా సాగవుతుందని చెబుతూ తెలుగు రాష్ట్రాల్లోని మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతుందని చెప్పారు. ఇక్కడి మిర్చికి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామని తేలిపారు.
పెట్టుబడి తగ్గించి.. ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని భరోసా ఇచ్చారు.