ఎన్డీటీవీ ప్రమోటర్లకు సెబీ రూ  27 కోట్ల  జరిమానా  

ఎన్డీటీవీకి చెందిన ప్రణయ్ రాయ్ సహా ప్రమోటర్లపై మార్కెట్ రెగ్యులేటర్ సెబి  షాకిచ్చింది. కంపెనీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌తో పాటు వారి నిర్వహణలోని ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ కంపెనీపై రూ.27 కోట్ల  జరిమానా విధించింది. 

రెండు రుణ ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వాటాదారులకు తెలియకుండా దాచినందుకు సెబీ ఈ చర్యలు తీసుకుంది. క్వాంటమ్ సెక్యూరిటీస్ సంస్థ 2017లో ఇందుకు సంబంధించి సెబీకి ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తులో ఇది వాస్తవంగా తేలడంతో చర్యలు తీసుకుంది. రుణ ఒప్పందాలను వాటాదారులకు సమాచారాన్ని దాచడం ద్వారా వివిధ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎన్టీడీవీ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్‌పై రూ.27 కోట్ల జరిమానాను విధించింది

సెబీ. క్వాంటమ్ సెక్యూరిటీస్ ఎన్డీటీవీ వాటాదారుల్లో ఒకరు. 2017లో ఫిర్యాదు చేసింది. ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్. సెబి ప్రకారం ఇందులో కొన్ని రుణ ఒప్పందాలు ప్రమోటర్లపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయి. రుణ ఒప్పందాల్లో ఒకటి ఐసీఐసీఐతో, మరో రెండు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రయివేట్ లిమిటెడ్ (వీసీఎల్పీ) ఉన్నాయి.

ఐసీఐసీఐ రుణాన్ని చెల్లించడం కోసం వీసీఎల్పీతో 2009లో రూ.350 కోట్ల రుణ ఒప్పందం జరిగింది. ఏడాది తర్వాత వీసీఎల్పీతో రూ.53.85 కోట్ల మరో రుణ ఒప్పందం జరిగింది. ఈ రుణ ఒప్పందాల్లోని క్లాజులు, నిబంధనలు ఎన్డీటీవీ కార్యకలాపాలపై, వాటాదారులపై ప్రతికూల ప్రభావం పడిందని సెబి తన 52 పేజీల ఆదేశంలో తెలిపింది.

రుణ ఒప్పందాల్లోని షరతు ప్రకారం ఎన్డీటీవీలో పరోక్షంగా వీసీపీఎల్ 30 శాతం వాటా కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. ఎన్డీటీవీ షేర్ ధరపై ప్రభావం చూపే ఇలాంటి సమాచారాన్ని మైనార్టీ వాటాదారులకు తెలియకుండా ప్రమోటర్లు వ్యవహరించినట్లు సెబి తెలిపింది.