తీవ్ర అస్వస్థతతో అపోలోలో చేరిన రజినీకాంత్     

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం చేరారు. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నారు. కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్‌గా తేలింది.

రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందొద్దని అపోలో వైద్యులు ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చూస్తోందని.. రజినీకాంత్‌కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. 

నాలుగు రోజులుగా రజినీకాంత్ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. బీపీ పెరగడంతో చిత్ర యూనిట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసిందని వైద్యులు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రముఖులు, అభిమానులు ఆస్పత్రికి రావొద్దని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 22న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లోను ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింద‌ని ఆపోలో ఆసుప‌త్రి వైద్యులు పేర్కొన్నారు. బీపీ  అదుపులో లేక‌పోవ‌డంతో ఆసుప‌త్రిలో చేరిన ర‌జనీకాంత్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని,  బీపీ కంట్రోల్ కాగానే డిశ్చార్జ్ చేస్తాం  అని వైద్యులు ప్రెస్ నోట్‌లో తెలిపారు.

అన్నాత్తె షూటింగ్ కోసం కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు ర‌జ‌నీకాంత్. ఇటీవ‌ల అన్నాత్తె చిత్ర బృందంలో 8 మందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో షూటింగ్ ఆపేసారు. ర‌జ‌నీకాంత్‌కి నిర్వ‌హించిన ప‌రీక్షలో నెగెటివ్ అని తేలిన ఆయ‌న స్వీయ ‌నిర్భందంలోకి వెళ్ళారు. 
డిసెంబ‌ర్ 31న ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ గుర్తు, జెండా, అజెండా ప్ర‌క‌టించ‌నున్న త‌రుణంలో ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డం అంద‌రిని ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.