అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు ఏడుగురు ఎమ్మెల్యేలుండగా ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ప్రస్తుతం జేడీయూకు ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. అయితే ఈ ఆరుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలను నెలకిందే జేడీయూ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నోటీసులు కూడా జారీ చేసింది.
హాంగ్ మాంగ్ఫీ, జిక్కే టాకో, డోంగ్రూ స్యోంగ్జూ, తలేమ్ తాహోబ్, కన్‌గ్గోంగ తాకు, డోర్జీ వాంగ్ఢీ ఖర్మ అనే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ వ్యవహారంపై అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు బియురాం వాంఘే మాట్లాడుతూ… ‘‘ప్రజలు అభివృద్ధివైపు నిలిచారు. ముఖ్యమంత్రి పెమాఖండు, ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంచారు’’ అని పేర్కొన్నారు.
ఈ ఘటనతో తాము ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయామని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ పేర్కొన్నారు. అయినా సరే తాము బీజేపీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా దక్కినా, తాము స్నేహపూర్వక ప్రతిపక్షం గానే కొనసాగుతామని కేసీ త్యాగీ తెలిపారు.
More Stories
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
జార్ఖండ్లో ఎన్నార్సీని అమలు చేస్తాం