డిటిహెచ్‌లలో భారీ సంస్కరణ

దేశంలో డైరెక్ట్ టు హోం (డిటిహెచ్) రంగం మార్గదర్శకాల సవరణకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణలు భా రీ స్థాయిలోనే ఉన్నాయి. ప్రధాని అధ్యక్షతన బు ధవారం జరిగిన కేంద్రకేబినెట్ భేటీలో తీసుకు న్న డిటిహెచ్ నిర్ణయంతో ఇకపై డిటిహెచ్ సేవల రంగానికి లైసెన్సును 20 ఏళ్ల కాలపరిమితి పరిధిలో జారీ చేస్తారు.

ఇంతకు ముందు ఈ లైసెన్స్ కాలపరిమితి పది సంవత్సరాలే ఉండేది. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంత్రి మండలి భేటీ వివరాలను విలేకరులకు తెలిపారు. సవరించిన మార్గదర్శకాలతో డిటిహె చ్ రంగంలో ఇకపై నూటికి నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) అనుమతిస్తారు.

ఇప్పటివరకూ ఇది 49 శాతంగా ఉంది. చేపట్టిన భారీ సవరణల విషయంపై టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)తో ముందుగానే కేంద్రం సంప్రదింపులు జరిపిందని మంత్రి వివరించారు. ఇక లైసెన్స్ రుసుంకు సంబంధించి వినియోగదారుల నుంచి త్రైమాసిక ప్రాతిపదికన సేకరిస్తారు.

శాటిలైట్ ద్వారా నేరుగా ఇండ్లకు టీవీల ప్రత్యక్ష ప్రసారాలు అందేలా చేస్తూ టీవీ ఛానెల్స్ నిర్వహణకు అత్యంత కీలకంగా వ్యవహరించే డిటిహెచ్‌లో ఇప్పుడు విదేశీ పెట్టుబడులకు పెద్ద పీట వే శారు. దేశంలో డిటిహెచ్ సేవల గురించి అభిప్రాయాలను తెలియచేయాలని ఈ నెల 7వ తేదీన ట్రాయ్ సంప్రదింపుల పత్రం వెలువరించింది.

ఎటువంటి రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలనే అంశాలను ఇందులో పొందుపర్చారు. దీనికి సంబంధించి భాగస్వామ్యపక్షాల నుంచి రాతపూర్వక స్పందనలు, సంప్రదింపుల పత్రాలు, ఫీడ్‌బ్యాక్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో వేర్వేరు దశలలో ముగిసింది.